రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వైకాపాకే దక్కుతుందని శ్రీదేవి అన్నారు. వ్యవసాయ సంబంధిత సేవలన్నీ రైతు భరోసా కేంద్రాల్లో పొందవచ్చని వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా... ఏడాది పాలనలో సంక్షేమ విప్లవం తెచ్చిందని చెప్పారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. శ్రీదేవి - తాడికొండ రైతు భరోసా కేంద్రం తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం హామీలు అమలు చేసినట్లు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. తాడికొండలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు భరోసా కేంద్రం ప్రారంభానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 90 శాతం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క వైకాపాకే దక్కుతుందని శ్రీదేవి అన్నారు. వ్యవసాయ సంబంధిత సేవలన్నీ రైతు భరోసా కేంద్రాల్లో పొందవచ్చని వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా... ఏడాది పాలనలో సంక్షేమ విప్లవం తెచ్చిందని చెప్పారు.
ఇదీ చూడండి: 'పేదల సంక్షేమం కోసమే సీఎం జగన్ కృషి'
TAGGED:
తాడికొండ తాజా వార్తలు