రైల్వేశాఖకు కృతజ్ఞతతో ఓ యజమాని తన ఇంటిపై రైలు ఇంజన్ ఆకారంతో నీళ్ల ట్యాంక్‌ని నిర్మించాడు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన పిల్లి విజయభాస్కర్ 20 సంవత్సరాల క్రితం తెనాలిలో సిద్ధార్థ శిక్షణ కేంద్రం పెట్టాడు. అప్పటినుంచి ఎంతోమంది నిరుద్యోగులకు కోచింగ్ ఇవ్వడంతో... రైల్వే శాఖలో వారందరూ ఉద్యోగాలు సాధించారు. తన శిక్షణ కేంద్రంలోని విద్యార్థులకు రైల్వేశాఖ జీవితాన్ని ఇచ్చిందని.....ఆ కృతజ్ఞతతో తన ఇంటిపైన రైలు ఇంజన్ ఆకారంతో నీటి ట్యాంక్ ను నిర్మించానని విజయభాస్కర్ తెలిపారు. విద్యార్థులకే కాక ..పరోక్షంగా రైల్వే వల్ల నాకు కూడా మేలు జరిగిందని భాస్కర్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఇదీచూడండి.జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం