గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయంలోకి ఇన్ఫ్లో 26 వేల క్యూసెక్కులు ఉండగా.. మూడు గేట్లు ఎత్తి 18 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. corona cases: కొత్తగా 1,843 కరోనా కేసులు... 12 మంది మృతి