ETV Bharat / state

ప్రజా గాయకుడు పారెళ్ల రత్తయ్య ఇకలేరు.. ‘అమరావతి’ వైభవంపై ఆయన పాట విన్నారా? - అమరావతి

Parella Rathaiah: సీనియర్‌ ప్రజా నాట్యమండలి కళాకారుడు కామ్రేడ్‌ పారెళ్ల రత్తయ్య ఇకలేరు. కొన్ని వందల నాటకాలకు నేపథ్య గాయకుడిగా పని చేసిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. తన చిన్నతనం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీతోనే కలిసి నడిచిన ఆయన గొప్ప ప్రజా కళాకారుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందారు.

Parella Rattaiah
పారెళ్ల రత్తయ్య
author img

By

Published : Sep 7, 2022, 8:01 PM IST

Parella Rattaiah: సీనియర్‌ ప్రజా నాట్యమండలి కళాకారుడు కామ్రేడ్‌ పారెళ్ల రత్తయ్య (75) ఇకలేరు. భూమి భాగోతం, రాజకీయ భాగోతం వంటి కొన్ని వందల నాటకాలకు నేపథ్య గాయకుడిగా పనిచేసిన ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. తన చిన్నతనం నుంచి భారత కమ్యూనిస్టు పార్టీతోనే కలిసి నడిచిన ఆయన గొప్ప ప్రజా కళాకారుడిగా, గాయకుడిగా గుర్తింపు పొందారు. తన గాత్రం ద్వారా స్థానికంగా సీపీఐ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. పుట్టెడంత పేదరికం.. కాళ్లు, కళ్లూ పనిచేయని దైన్యం వెంటాడుతున్నా లెక్కచేయకుండా మొక్కవోని సంకల్పంతో ముందుకెళ్తూ తన గాత్రంతో వేలాదిమంది ప్రజల్ని చైతన్యం చేసి స్ఫూర్తి కెరటంలా నిలిచారు. వృద్ధాప్యం దరిచేరినా ఆయన గళంలో మాత్రం పదును తగ్గలేదని అక్కడి స్థానికులు ఆయన గొప్పతనం గురించి చెప్పుకొంటుంటారు.

తాను రాసిన అశోకుని గీతానికి రత్తయ్య అద్భుతంగా పాడి దానికి జీవం పోశారంటూ ప్రముఖ రచయిత గోలి సీతారామయ్య అనేకసార్లు గొప్పగా చెప్పేవారని రత్నారావు అనే వ్యక్తి గుర్తు చేసుకున్నారు. పాటను పాడటంలో, దాన్ని సొంతం చేసుకోవడంలో రత్తయ్య నిజాయతీ కనబడుతుందని పేర్కొన్నారు. అన్నింటికి మించి ఆయన గొంతే ఓ అద్భుతమని కొనియాడారు. ఏ అవకాశాలూ లేకపోయినా, శారీరక వైకల్యం వెంటాడుతున్నా తనంటత తానే బాణీలు కూర్చుకొని శ్రోతల గుండెల్లోకి చొప్పించగల గొప్ప ప్రతిభావంతుడన్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన రత్తయ్య కమ్యూనిస్టు పార్టీ ప్రేరణతో కష్టజీవుల పూర్తికాల ప్రేమికుడిగా మారారన్నారు. ఆనాటి నుంచి తన తుదిశ్వాస వరకూ శ్రమ జీవుల గురించే ఆలోచించడంతో పాటు ఓ ప్రజా కళాకారుడిగా దాదాపు అర్ధ శతాబ్దం పాటు వారి కోసమే పాటలు పాడారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ మూల సిద్ధాంతాల పట్ల, సోషలిజం, సామాజిక సమానత్వం పట్ల పరిపూర్ణ విశ్వాసంతో పనిచేస్తూ నిరాడంబర, నిబద్ధత కలిగిన జీవితం గడిపిన రత్తయ్య నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయనకు విప్లవాభివందనాలు తెలియజేస్తున్నట్టు రత్నారావు తెలిపారు. పారెళ్ల రత్తయ్య అమరావతి వైభవంపై తనదైన శైలిలో ఆలపించిన వీడియో మీకోసం..

పారెళ్ల రత్తయ్య అమరావతి వైభవంపై వినిపించిన పాట

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.