ETV Bharat / state

Protests Against Chandrababu Arrest: బాబు కోసం ఆగని నిరసనలు.. అధినేతను విడుదల చేయాలంటూ పూజలు, ర్యాలీలు, దీక్షలు

Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ పాదయాత్రలు, కొవ్వొత్తుల ర్యాలీలు, జలదీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా వెరవకుండా తెలుగుదేశం కార్యకర్తలు ముందడుగు వేస్తున్నారు.

Protests Against Chandrababu Arrest
Protests Against Chandrababu Arrest
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 26, 2023, 9:04 AM IST

Protests Against Chandrababu Arrest: బాబు కోసం ఆగని నిరసనలు.. అధినేతను విడుదల చేయాలంటూ పూజలు, ర్యాలీలు, దీక్షలు

Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా నాయనపల్లెలో తెలుగుదేశం నేతలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. అనంతపురం-తాడిపత్రి ప్రధాన రహదారిపై నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాయదుర్గంలో దీక్షలకు సీపీఐ నాయకుడు జగదీశ్‌, మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్‌ సంఘీభావం తెలిపారు. ఇటీవల అస్వస్థతకు గురైన తెలుగుదేశం నేత కాలవ శ్రీనివాసులును పీసీసీ మాజీ అధ్యక్షుడు శైలజానాథ్‌ పరామర్శించారు.

అనంతపురం దీక్షా శిబిరాన్ని ధర్మవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌ సందర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ బ్రహ్మసముద్రం మండలం కుర్లగుంట గ్రామస్థులు 101 కొబ్బరికాయలు కొట్టి భజన కార్యక్రమం నిర్వహించారు. రాప్తాడు పరిధిలోని పాపంపేట మాజీ మంత్రి పరిటాల సునీత ఆమరణ దీక్ష చేపట్టారు.

TDP Protests in AP Over Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై ఆగని నిరసన జ్వాలలు.. 13వ రోజు కొనసాగిన ఆందోళనలు

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం శివాడికి చెందిన సుందర్ రాజు.. రిలే దీక్షల కోసం బైక్‌పై వెళ్తూ మార్గం మధ్యలో గుండెపోటుతో మృతి చెందారు. సత్యసాయి జిల్లా పెనుకొండలో తెలుగుదేశం నేత సవిత ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కదిరిలో రిలే దీక్షలు సాగుతున్నాయి. కోవెలగుట్టపల్లి గంగమ్మ ఆలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చిత్రావతి నదిలో జలదీక్ష చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దీక్షలు చేస్తున్న తెలుగుదేశం నాయకులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

వైఎస్సార్‌ జిల్లా మైదుకూరు మండలం ఎర్రనీళ్ల కుంటలో తెలుగుదేశం నాయకులు జలదీక్ష చేశారు. కమలాపురం దీక్షల్లో పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కడప పోలేరమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి.. 101 టెంకాయలు కొట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కర్నూలులో కళ్లకు గంతలు కట్టుకుని నల్లబెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. నంద్యాల దీక్షల్లో ఆర్య వైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

TDP Protests Across the State Over Chandrababu Arrest: 'బాబు కోసం మేము సైతం'.. 11వరోజూ ఆగని ఆగ్రహ జ్వాలలు

ఎన్టీఆర్‌ జిల్లా గంపలగూడెం మండలం ఊటుకూరులో తెలుగుదేశం నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నందిగామ వద్ద మునేరులో నల్ల జెండాలతో జలదీక్ష చేశారు. మైలవరం దీక్షా శిబిరాన్ని సందర్శించిన మాజీ మంత్రి దేవినేని ఉమా.. పార్టీ నాయకులకు సంఘీభావం తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబుకు శత్రుదోషాలు తొలగిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ.. నాగాయలంక మండలం సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు జరిపించారు.

అంబేడ్కర్‌ కోనసీమ జల్లా కేంద్రం అమలాపురంలో పోలీసు ఆంక్షల నడమే.. తెలుగు మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పి.గన్నవరం నిరసన దీక్షల్లో సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముమ్మిడివరంలో 3 కిలోమీటర్ల మేర కాగడాల ర్యాలీ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరంలో తెలుగు మహిళలు.. కళ్ళకు గంతలు కట్టుకుని నూటొక్క బిందెల నీళ్లతో గ్రామంలో ర్యాలీ చేశారు. ఆ తర్వాత గ్రామదేవత బోయాలమ్మ తల్లికి పూజలు చేశారు. రోలుగుంటలో రిలే దీక్షలను టీడీపీ నేత భక్తుల తాతయ్య బాబు ప్రారంభించారు. అనకాపల్లిలో టీడీపీ కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకుని సైకో పాలన పోవాలంటూ నినదించారు.

TDP Leaders Continues Relay Hunger Strikes Against Chandrababu Arrest: "చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలి"..కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి కొత్తపేట సత్యనారాయణ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేట్టారు. కలశాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి.. 101 కొబ్బరికాయలు కొట్టారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేటలో మోకాళ్లపై నిలబడి పోస్టుకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రిలే దీక్షల్లో యాదవులు పాల్గొన్నారు.

TDP Leaders Protest against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా కొనసాగిన టీడీపీ నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.