నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. రైతు సమన్వయ కమిటీ, కార్మిక ప్రజా సంఘాల నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుంటూరు జిల్లాలోని హిమానీ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నవంబర్ నుంచి కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 500పైగా రైతు సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు హరిప్రసాద్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం రోజున నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందని హరిప్రసాద్ అన్నారు. దీనిని వ్యతిరేకించిన రైతు నాయకులపై కేసు పెట్టి, రైతు శిబిరాల పైన దాడి చేయించారన్నారు. ఈ దాడులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని నిరసన దీక్షలు, కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు దిల్లీలోనే కాక.. దేశవ్యాప్తంగా ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అన్నదాతల ఆందోళనలో ఏకమైన జాట్‌లు