గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వేంకటేశ్వర స్వామికి ఎనలేని విశిష్టత ఉంది. ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందనే విశ్వాసం వ్యాప్తిలో ఉంది. సంతాన భాగ్యం కోసం స్వామివారిని దర్శించుకునేందుకు సోమవారం విజయవాడ నుంచి దంపతులు తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. అర్చకుడు నరసింహాచార్యుల పాదాలకు నమస్కారం చేశారు.
అప్పుడా పూజారి... తమ కోరిక నెరవేరాలంటే మహిళ ఒంటరిగా పూజ చేయాలని చెప్పి... ఆమెను ఆలయం లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ అరుస్తూ బయటకు వచ్చేసింది. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి నరసింహాచార్యులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన గురించి ఆలయ అధికారులకు సమాచారమిచ్చి వారు వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి..