ETV Bharat / state

కనీసం లక్ష పడకలు సిద్ధం చేయండి: సీఎం జగన్

లాక్​డౌన్​లో కేంద్రం సడలింపులు విధించటంతో ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో చిక్కుకున్న ఏపీ వాసులంతా త్వరలో స్వస్థలానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్​గా తీసుకోవాలని ఆదేశించారు.

cm jagan news
cm jagan news
author img

By

Published : May 2, 2020, 4:29 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కనీసం లక్ష పడకలు సిద్ధం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కొవిడ్‌-19 వ్యాప్తి నివారణ చర్యలపై సమీక్షించిన సీఎం... వివిధ రాష్ట్రాల్లో, విదేశాల్లో చిక్కుకున్న వారి అంశంపై ప్రధానంగా చర్చించారు. వారంతా తిరిగివస్తున్న దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామ సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. యూనిట్​కు కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్‌ వసతి కల్పించాలని చెప్పారు. వైద్యుడు, ఏఎన్‌ఎంలు,‌ ఆశా కార్యకర్త, మందులను మొబైల్‌ యూనిట్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఈ మేరకు అంగన్​వాడీలు, పంచాయతీ రాజ్‌ విభాగాలు గ్రామాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మొబైల్ వాహనాలుగా ఆర్టీసీ బస్సులు ...

కనీసం 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసరాలను తీసుకెళ్లే మొబైల్‌ వాహనాలుగా మార్చాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులోనే వీలైనంత వరకు ఫ్రీజర్లు పెట్టి పాలు, పెరుగు, గుడ్లు, పండ్లు వంటి నిత్యావసరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేసుల తీవ్రత ఉన్న క్లస్టర్లలో నిత్యావసరాల కోసం ఒక వ్యక్తికే పాసు ఇవ్వాలని చెప్పారు. కంటైన్‌మెంట్‌ జోన్లను గుర్తించి అక్కడ అనుసరించాల్సిన విధివిధానాలను జారీ చేయాలని చెప్పారు. అనుమతులు ఉన్న దుకాణాల వద్ద పాటించాల్సిన మార్గదర్శకాలు ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఇదీ చదవండి

జగన్​ జీ... మీ సాయానికి కృతజ్ఞతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.