కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల హక్కులను దెబ్బతీస్తుందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో.. పీఆర్ విజ్ఞాన (సీపీఎం కార్యాలయం) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు దివంగత కామ్రేడ్ పోపూరి రామారావు జ్ఞాపకార్థం.. గ్రామస్థులు, దాతల సహకారంతో రూ.64 లక్షలతో ఈ భవనాన్ని నిర్మించారు. గ్రామస్థుల ఐక్యతతో ఏర్పాటు చేసిన ఈ భవనం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
రాష్ట్రాంలో ఓడరేవులను కూడా కేంద్రమే తీసేసుకుంటుందన్నారు. వ్యవసాయ, విద్యుత్, విద్య.. ఇలా అన్ని చట్టాలను కేంద్రమే తన చేతిలోకి తీసుకుంటుందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నా.. రాష్ట్రాల హక్కుల కోసం తెదేపా, వైకాపా, తెరాస(తెలంగాణ రాష్ట్ర సమితి) లాంటి ప్రాంతీయ పార్టీలు కలసికట్టుగా పోరాడాలని కోరారు. తమ పార్టీ(సీపీఎం) మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: