ETV Bharat / state

Guntur Murder: యావత్ రాష్ట్రాన్ని కలచివేసిన గుంటూరు యువతి హత్య

గుంటూరు నగర నడిబొడ్డున పట్టపగలే జరిగిన యువతి హత్య.. యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. విచక్షణారహితంగా దాడి చేసిన నిందితుడికి కఠిన శిక్ష అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దిశ చట్టం కింద వేగంగా చర్యలు తీసుకోవాలన్న సీఎం.. బాధిత కుటుంబానికి 10లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.

Guntur Murder
Guntur Murder
author img

By

Published : Aug 16, 2021, 4:26 AM IST

75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజున గుంటూరులో జరిగిన దారుణ హత్యపై.. రాష్ట్రంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్‌... దిశ కింద కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. రమ్య మృతదేహమున్న జీజీహెచ్​ను సందర్శించిన హోంమంత్రి సుచరిత, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. కుటుంబీకులను ఓదార్చారు. మృతురాలి ఫోన్‌ లాక్ ఓపెన్ అయితే మరింత సమాచారం లభించొచ్చని సుచరిత తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు.

ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం: చంద్రబాబు

రమ్య హత్యపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల దీనస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందన్నారు. గత రెండేళ్లలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని.. ప్రభుత్వ చేతకానితనమా లేక నిందులకు రక్షణ కల్పించడమా అనే అనుమానాలు వస్తున్నాయన్నారు. రమ్య తండ్రి, అక్కతో మాట్లాడిన తెలుగుదేశం ప‌్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారిని నేడు నేరుగా కలవనున్నట్టు తెలిపారు.

ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలి: రాజకీయ పార్టీలు

వైకాపా హయాంలో నిందితులకు తప్ప బాధితులకు భరోసా లేదని తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. రమ్య హత్యపై ఆవేదన వ్యక్తం చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని పార్టీ నేతలను ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేసిన జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌.. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

సంబంధిత కథనాలు:

Arrest: రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్: డీజీపీ గౌతమ్ సవాంగ్

రమ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.