మంగళవారం కిడ్నాప్‌నకు గురైన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం 24వ వార్డుకు చెందిన నాలుగేళ్ల బాలుడు వేముల త్రినాధ్ ఆచూకిని... పోలీసులు పిడుగురాళ్ల వద్ద కనుగొన్నారు. ఇంటి బయట ఆడుకుంటుండగా... పిల్లాడిని ఎవరో కిడ్నాప్ చేశారు. కనిపించకుండా పోవడంతో... బంధువులు ఎంత వెతికినా ప్రయోజనం లేదు. భవాని మాలధారణలో ఉన్న వ్యక్తి బాలుడిని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి... కుటుంబసభ్యులకు తెలియజేశారు.
బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... వారు దర్యాప్తు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లోని సీసీ పుటేజీలు పరిశీలించి... అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. బాలుడి కోసం గాలించారు. గుంటూరు బస్టాండ్‌లో సీసీ పుటేజీని చూడగా... పిడుగురాళ్ల, నరసరావుపేట మీదుగా కిడ్నాపర్ బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. బుధవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తుండగా... పిడుగురాళ్ల వద్ద బాలుడిని చూశారు. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి...రూ.5 లక్షల కోసం సోదరుడి కుమారుడిని కిడ్నాప్ చేశాడు..!