ETV Bharat / state

lokesh narsaraopeta tour: నారా లోకేశ్‌కు 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు

nara lokesh narsapuram tour
nara lokesh narsapuram tour
author img

By

Published : Sep 9, 2021, 12:22 PM IST

Updated : Sep 9, 2021, 4:03 PM IST

15:58 September 09

Notices to Lokesh under 41A CRPC
41ఏ సీఆర్‌పీసీ కింద లోకేశ్​కు నోటీసులు

14:08 September 09

12:20 September 09

లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

లోకేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

విజయవాడ వచ్చిన తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు నోటీసులు ఇచ్చిన కృష్ణలంక పోలీసులు.. ఆయన్ను ఉండవల్లిలోని తన ఇంటికి  తరలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం, కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలకు సంబంధించి 41ఏ సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేసినట్లు కృష్ణలంక పోలీసులు పేర్కొన్నారు.  

పోలీసుల తీరుపై లోకేశ్​ ఆగ్రహం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. నరసరావుపేట పర్యటన కోసం వచ్చిన లోకేశ్​ను మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్‌ కాన్వాయ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు కనకదుర్గ వారధి వద్దకు చేరుకుంది. కనకదుర్గ వారధి నుంచి నరసరావుపేట వెళ్లేందుకు యత్నించారు. లోకేశ్‌.. నరసరావుపేట వెళ్లేందుకు అంగీకరించకపోవడంతో పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉండవల్లిలోని లోకేశ్​ ఇంటికి తరలించేందుకు పోలీసులు యత్నించారు. లోకేశ్‌ను కారులో నుంచి బలవంతంగా లాగేందుకు యత్నించిన పోలీసులపై లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పర్యటనను అడ్డుకోవడంపై లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని లోకేశ్‌, పార్టీ నేతల పట్టుపట్టారు. దీంతో రోడ్డుపైనే లోకేశ్​కు నోటీసులు ఇచ్చారు. దాదాపు 2 గంటలపాటు కనకదుర్గ వారధి వద్ద లోకేశ్‌ కాన్వాయ్‌ నిలిచింది. దీంతో కృష్ణా వారధి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు 41ఏ సీఆర్‌పీసీ కింద లోకేశ్‌కు రోడ్డుపైనే నోటీసు జారీచేసి ఉండవల్లిలోని ఇంటికి తరలించారు.

నా పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియట్లేదు. నేను ధర్నాలు, ఆందోళనలు చేయడానికి వెళ్లట్లేదు. ఒక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నా. కుటుంబాన్ని పరామర్శించి మీడియా సమావేశం పెట్టి వస్తా. పరామర్శకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. - నారా లోకేశ్​

  పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు, అరెస్టులు..            

గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని లోకేశ్‌ నిర్ణయించారు. అదే విధంగా గుంటూరులో రమ్య హత్య జరిగి 21 రోజులైనా శిక్ష వేయలేదంటూ నిరసన తెలపాలనుకున్నారు. కొవిడ్ దృష్ట్యా నారా లోకేశ్​ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు విమానాశ్రయం పరిసరాలు, జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

లోకేశ్‌ పర్యటన అనుమతి నిరాకరించిన నేపథ్యంలో పలువురు తెదేపా నేతలను నిర్బంధించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజా, సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జులు చదలవాడ అరవిందబాబు, కోడెల శివరామ్‌, గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బచ్చుల అర్జునుడు సహా మరికొంత మందిని గృహ నిర్బంధం చేశారు.

ఇదీ చదవండి:

lokesh narsaraopeta tour live: లోకేశ్‌ నరసరావుపేట పర్యటనపై ఉత్కంఠ

TDP RALLY: అమదాలవలసలో తెదేపా నేతల అరెస్ట్​.. విడుదల​

Last Updated : Sep 9, 2021, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.