గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవకతవకలపై విచారణకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలతో ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తెలిపారు. దర్యాప్తు పర్యవేక్షణకు ఏఎస్పీ గంగాధరం, డీఎస్పీ జెస్సీ ప్రశాంతికి బాధ్యతలు అప్పగించినట్లు వెల్లడించారు. నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు తీసుకున్న ఉదంతంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేసి నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హఫీజ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
"ఆ మోసంతో.. నాకెలాంటి సంబంధమూ లేదు"