గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం దిండి గ్రామ శివారు మడ అటవీప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు అడవులదీవి ఎస్సై హరిబాబు తెలిపారు. ఘటనా స్థలంలో సామగ్రిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. 25 లీటర్ల సారాను సీజ్ చేశారు.
తీర ప్రాంతంలో పెరుగుతున్న సారా తయారీ, అమ్మకాలను అరికట్టేందుకు స్థానిక సివిల్, ఎక్సైజ్ పోలీసులు... కలిసి నిత్యం దాడులు నిర్వహిస్తూనే ఉంటామని ఎస్సై హరిబాబు తెలిపారు. అక్రమ మద్యం అమ్మకాలు, నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమాల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని స్థానికులకు సూచించారు.
ఇదీ చూడండి: 'తహసీల్దార్లకు జీతాలు చెల్లించని కలెక్టర్లకూ వేతనాలు ఆపాలి'