ETV Bharat / state

పాన్ మసాలా ముసుగులో నిషేధిత గుట్కా తయారీ

గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో నిషేధిత గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. గుట్కా తయారీ సామాగ్రిని, భారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత గుట్కాలు, ఖైనీలు తయారుచేసినా.. అమ్మినా ఉపేక్షించేది లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హెచ్చరించారు. ఒకరిని అరెస్టు చేశారు.

guntur district
నిషేధిత గుట్కా తయారీ కేంద్రం పై పోలీసులు దాడి
author img

By

Published : Jul 19, 2020, 7:40 PM IST

గుంటూరు జిల్లా పెదకాకాని మండలం కొప్పురావూరు గ్రామంలో గుట్కా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించారు. 25వేల గుట్కా ప్యాకెట్లు, 21 టన్నుల వక్క, 14 బస్తాల కత్తా, యాలుకలు, సున్నం, కోటి రూపాయలు విలువచేసే మూడు మిషనరీలను, జరదా, కెమికల్​ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గోదాము సీజ్ చేశారు

సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఆర్ఎమ్కే పేరుతో పాన్ మసాలా తయారీకి అనుమతి పొందాడు. కానీ, పాన్ మసాలా ముసుగులో టెంపర్ అనే గుట్కా ప్యాకెట్లను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ అ మేనేజర్ గా పని చేస్తున్న జై సింహని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. లైసెన్సు పొందిన సుధాకర్ రెడ్డి, మరో వ్యక్తి ఫణిల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నామని వెల్లడించారు. నిషేధిత గుట్కాలు, ఖైనీలు తయారుచేసినా.. అమ్మినా ఉపేక్షించేది లేదని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మి రెడ్డి హెచ్చరించారు.

ఇదీ చదవండి లోకేశ్‌ దాతృత్వం... విలేకరులకు బీమాతో జీవితంపై ధీమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.