అమరావతి రైతుల పాదయాత్రపై పోలీసులు నిఘా పెట్టారు. అధికారికంగా 157 మందికి మాత్రమే పాదయాత్ర ఇచ్చినా వేలాది మంది పాదయాత్రలో పాల్గొనటంపై పోలీసులు దృష్టి సారించారు. పాదయాత్ర నిబంధనలు అతిక్రమిస్తోందంటూ అందుకు సంబంధించిన వీడియోలు చిత్రీకరిస్తున్నారు. డ్యూటీలో ఉన్న పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఇదే పనిలో కనిపించారు. ప్రత్యేకంగా వీడియోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని పాదయాత్ర దృశ్యాలు తీస్తున్నారు.
అలాగే మరికొందరు సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారు. వీటికి తోడుగా ప్రతి సీఐ స్థాయి అధికారి బాడి వార్మ్ కెమెరాలు ధరించి పాదయాత్రను రికార్డ్ చేస్తున్నారు. కోర్టు ఆదేశాల మేరకు బహిరంగసభలు నిర్వహించలేదు. అలాగే హ్యాండ్ మైక్ మాత్రమే వినియోగించారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. పోలీసులు వాటిపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఈ దృశ్యాలన్నింటినీ పోలీసులు కోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే పాదయాత్రలో పాల్గొన్న రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాల వారి వీడియోలు తీశారు. అనుమతి లేకుండా పాదయాత్రలో పాల్గొనటంపై వారికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: