ETV Bharat / state

లాక్​డౌన్: నిబంధనలు అతిక్రమిస్తే సంగతి ఇంతే..!

కరోనా కట్టడికి ప్రభుత్వాలు, అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కొందరు డోంట్ కేర్ అంటున్నారు. అలాంటి వారికి లాఠీతో సమాధానం చెప్పారు పోలీసులు. లాక్​డౌన్ రెండో రోజు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ గుంటూరులో రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అంతే... కొంచెం కూడా బాధ్యత లేకుండా రోడ్డుపైకి వచ్చి మాట్లాడతావా అంటూ పోలీసులు లాఠీ ఝుళిపించారు. నిబంధనలు అతిక్రమిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పకనే చెప్పారు పోలీసులు.

police-lathi-charge-on-lock-down-violation-in-guntur
police-lathi-charge-on-lock-down-violation-in-guntur
author img

By

Published : Mar 24, 2020, 10:40 PM IST

Updated : Mar 24, 2020, 11:00 PM IST

లాక్​డౌన్ పాటించపోతే లాఠీ విరుగుద్ది..!

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించినా... గుంటూరు జిల్లాలో మాత్రం ఆటోలు, ద్విచక్ర వాహనాలు యథేచ్చగా తిరిగాయి. ఈ నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారులపై పోలీసులు లాఠీ ఝుళిపించారు. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేసిన ఆటోలు, ద్విచక్రవాహనాలను సీజ్ చేసి నగరపాలెం పోలీసు స్టేషన్​కి తరలించారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులు రాకుండా అడ్డుకున్నారు. కొందరు వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగగా పోలీసులు లాఠీలకు పనిచెప్పారు.

ఇదీ చదవండి : కరోనాపై ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది: డీజీపీ

Last Updated : Mar 24, 2020, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.