ETV Bharat / state

TADEPALLI RAPE CASE: తాడేపల్లి అత్యాచారం కేసు: పోలీసుల అదుపులో నిందితులు! - గుంటూరు జిల్లా నేర వార్తలు

గుంటూరు జిల్లా తాడేపల్లి అత్యాచార ఘటన తనను కలచివేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. మహిళలు భయం లేకుండా ఉండే పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మరోవైపు బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారం హోంమంత్రి అందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

తాడేపల్లి అత్యాచారం ఘటనపై ముమ్మర దర్యాప్తు

author img

By

Published : Jun 22, 2021, 10:31 PM IST

తాడేపల్లి అత్యాచారం ఘటనపై ముమ్మర దర్యాప్తు

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో యువతిపై అత్యాచారం ఘటన తనను కలచి వేసిందని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. అర్ధరాత్రి మహిళలు స్వేచ్ఛగా, భయం లేకుండా తిరిగే పరిస్థితులు కల్పించేందుకు మరింత కష్టపడి పని చేస్తానని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహిళల రక్షణ కోసం రాష్ట్ర పోలీసు శాఖ తీసుకొచ్చిన అభయం, దిశ యాప్‌లు అందరూ వినియోగించేలా మరింత ప్రచారం చేస్తామని చెప్పారు.

బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి...

గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5లక్షల రూపాయల పరిహారం చెక్కును బాధితురాలి తల్లికి అందజేశారు. నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు.

తెదేపా నేతల పరామర్శ...

జీజీహెచ్​ లో బాధితురాలిని తెలుగుదేశం నేతలు నక్కా ఆనంద్‌బాబు, శ్రావణ్‌కుమార్, అనిత పరామర్శించారు. అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ముమ్మర దర్యాప్తు...

సామూహిక అత్యాచారం కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సీతానగరం ప్రాంతంలో ఉండే పాత నేరస్థులను విచారిస్తున్నారు. మరికొందరి కదలికలపై నిఘా పెట్టారు. ఘటన జరిగిన రోజు వారు ఎక్కడున్నారనే అంశంపై సమాచారం సేకరిస్తున్నారు. అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను బాధితురాలు గుర్తించినట్లు సమాచారం. వీరిపై గతంలో పుష్కర ఘాట్లలో ఒంటరిగా ఉన్నవారిపై దాడులు చేసి దోపిడీలకు పాల్పడిన కేసులున్నాయని చెబుతున్నారు. ఈ ఘటనలో వారి ప్రమేయం ఏ మేరకు ఉందనే అంశంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.

ఇదీ చదవండి:

ఏపీ ప్రాజెక్టులపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.