ETV Bharat / state

సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు అరెస్ట్

Sankalp Siddhi Scam: సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు గుత్తా కిరణ్‌ ఎట్టకేలకు చిక్కాడు. నాలుగున్నర నెలలుగా చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతున్న కిరణ్‌.. పోలీసులకు దొరికాడు. నిందితుడిని విజయవాడకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

Sankalp Siddhi scam
సంకల్పసిద్ధి కుంభకోణం
author img

By

Published : Apr 8, 2023, 1:08 PM IST

Sankalp Siddhi Scam: సంకల్పసిద్ధి కుంభకోణంలో కీలక నిందితుడిగా భావిస్తున్న గుత్తా కిరణ్‌ ఎట్టకేలకు చిక్కాడు. నాలుగున్నర నెలలుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్న కిరణ్‌.. రెండ్రోజుల క్రితం బళ్లారి సమీపంలోని హోస్పేటలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు దొరికాడు. నిందితుడిని విజయవాడకు తీసుకొచ్చి విచారిస్తున్నారు. వివిధ స్కీమ్‌ల పేరుతో వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించారు.? స్థిర, చరాస్తులను ఎక్కడ కొనుగోలు చేశారు.? అవి ఎవరి పేరున ఉన్నాయి?. వంటి వివరాలను నిందితుడి నుంచి రాబట్టే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం సమాచారం సేకరించిన తర్వాత కిరణ్ అరెస్ట్​ను చూపించే అవకాశం ఉంది.

సంచలనం రేపిన సంకల్పసిద్ధి కుంభకోణం కేసులో కీలక నిందితుడు కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నవంబరులో వెలుగుచూసిన ఈ స్కాం 130 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మొత్తం 17 బ్యాంకు అకౌంట్ల ద్వారా అధిక శాతం లావాదేవీలు జరిగినట్లు తేలింది. డిపాజిటర్ల సంఖ్య 45 వేల వరకు ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అరెస్ట్ చేసినా.. కీలక సూత్రధారి కిరణ్‌ దొరకపోవడంతో పురోగతి లోపించింది.

ప్రత్యేక బృందాలు బెంగళూరు, బళ్లారి, అనంతపురం ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నిందితుడు దొరకడంతో కేసులో కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. మొదట దీనిని సంకల్పసిద్ధి ఈకార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ పేరుతో కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ సమయంలో గుత్తా వేణుగోపాలకృష్ణ ఎండీగా, ఆయన బంధువైన వెంకట నాగలక్ష్మిని డైరెక్టర్‌గా నమోదు చేశారు. తనకు సహాయకారిగా ఉంటాడని బళ్లారిలో ఉండే కిరణ్‌ను ఇక్కడకు తీసుకొచ్చి వ్యాపార బాధ్యతలు అప్పగించారు. దీంతో నాగలక్ష్మి స్థానంలో గుత్తా కిరణ్‌ను బోర్డులో డైరెక్టర్‌గా చేంజ్ చేశారు.

సంకల్ప సిద్ధి నిందితులు ముందుగా సరకుల స్కీమ్‌ పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. కిరణ్‌ వచ్చాక మరిన్ని స్కీమ్‌లను ప్రవేశపెట్టడంతో అనూహ్య రీతిలో వ్యాపారం విస్తరించింది. లావాదేవీలు, ఖాతాల సమాచారం వంటివి కిరణే చూసేవారు. డిపాజిటర్ల సొమ్ముతో బంధువుల పేరున భారీగా ఆస్తులు కూడబెట్టారు. సంకల్పసిద్ధి పేరుతో పలు జిల్లాల్లో భూములు కూడా కొనుగోలు చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి, సీఎస్‌ పురం, అనంతపురం జిల్లా ఇటుకులపల్లి, కర్నూలు జిల్లా నన్నూరు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారంలో భూములు కొన్నారు.

వీటిల్లో పలు ఆస్తులను ప్రభుత్వం అటాచ్‌ చేసింది. ఇంకా లెక్కలోకి రాని ఆస్తులను కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటి వరకు దాదాపు 40 కోట్లు రికవరీ అయ్యింది. ప్రస్తుతం పట్టుబడ్డ గుత్తా కిరణ్‌ నోరు విప్పితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 54 మందిని నిందితులుగా చేర్చిన సీసీఎస్‌ పోలీసులు. కిరణ్‌తో కలిపి 48 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.

సంకల్పసిద్ధి కేసులో కీలక నిందితుడు అరెస్ట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.