గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం విసదలలో మసీదు నిర్మాణ విషయంలో ఏర్పడిన గొడవలో 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో మసీదు విషయంలో గతంలో మనస్పర్థలు వచ్చాయి. ఆ సమయంలో ముస్లింలు రెండు వర్గాలుగా విడిపోయారు. గ్రామంలోని 126 గజాల స్థలంలో ఒక వర్గం వారు కమిటీ పేరుతో రిజిస్టర్ చేయించుకుని కొత్త మసీదు కట్టుకుంటున్నారు. 'ఆ స్థలం పీర్ల చావిడికి ఉపయోగించుకుంటున్నాము. అక్కడ మసీదు కట్టవద్దని మరో వర్గం అభ్యంతరం తెలిపింది. దీనితో రెండు వర్గాలు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో మెుదటి వర్గం వారు కొత్త మసీదుకు స్లాబు వేస్తున్నారు. ఆ సమయంలో రెండో వర్గంవారు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కర్రలతో, రాళ్లు, కారంతో దాడి చేసుకొవటంతో 15 మందికి గాయాలయ్యాయి. రెండు వర్గాల ఫిర్యాదు మేరకు 12 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండీ.. పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ.. మే 3కు వాయిదా