మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. జనసేన కార్యాలయం గేటు వద్దే పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని పర్యటన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లి తీరుతామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన కార్యాలయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జనసేన కార్యాలయం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు.
ఇదీ చూడండి: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో జనసేన నేతలు అరెస్ట్