నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద గత నెల ఏడో తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఎన్సీసీ కాలనీకి చెందిన అక్బర్, జావిద్ అనే వ్యక్తులు దొంగతనం చేసేందుకు ప్రయత్నించి ఈ హత్యకు పాల్పడ్డారని వెల్లడించారు.
బుచ్చిరెడ్డిపాలెంలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి.. గత నెల ఏడో తేదీ రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదు. కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరికి నిందితులు అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి వద్ద లొంగిపోగా.. ఆయనే వారిని పోలీసులకు అప్పగించారు.
మృతుడు రవీంద్రనాథ్ రెడ్డి సెల్ ఫోన్ ను దొంగతనం చేసేందుకు ప్రయత్నించగా.. ఆయన ప్రతిఘటించాడు. ఆ సమయంలో నిందితులు కత్తితో పొడిచి హతమార్చినట్లు నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. వీరిపై గతంలోనూ చోరీ కేసులు ఉన్నట్టు చెప్పారు.
ఇదీ చదవండి: