ETV Bharat / state

పోలీసు అమరవీరులకు నరసరావుపేటలో ఘన నివాళి

author img

By

Published : Oct 22, 2020, 9:15 AM IST

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. నరసరావుపేటలో ఘనంగా జరిగింది. డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రజలు, సిబ్బంది.. కొవ్వొత్తుల ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

police commemoration day in narasaraopet
నరసరావుపేటలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా జరిగింది. డీఎస్పీ వీరారెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు బస్టాండ్ నుంచి గడియార స్తంభం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. సిబ్బంది, స్థానికులతో కలిసి అక్కడి కూడలిలో మానవహారం నిర్వహించారు.

నరసరావుపేటలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని డీఎస్పీ తెలిపారు. ప్రజాసేవలో భాగంగా.. రాజ్యాంగ వ్యతిరేక శక్తులతో పోరాడి మరణించిన పోలీసులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన సరిహద్దు భద్రత అధికారులను గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలంటూ నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

విద్యుత్ భవన్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.