గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పుసులూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అపహరణ కేసు దర్యాప్తులో.. పోలీసులు పురోగతి సాధించారు. యువతిని కాపాడిన పోలీసులు.. పెదనందిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నెల 24 న ఇంటి వద్ద ఉన్న యువతిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు అపహరించారని తెలిపారు.
అశోక్, మరో ఇద్దరితో కలిసి కారులో బలవంతంగా యువతిని తీసుకెళ్లారని చెప్పారు. గుంటూరు మీదుగా హైదరాబాద్ వెళ్లిన నిందితులు.. తిరిగి యువతిని గుంటూరులో వదిలిపెట్టారన్నారు. నిందితుడు అశోక్ పై గతంలో అట్రాసిటీ కేసు నమోదైందని.. ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురినీ త్వరలో అరెస్ట్ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: