Modi Praises Sircilla weaver in Mann Ki Baat : ప్రధాని మోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ తన స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయానన్న మోదీ.. తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో హరిప్రసాద్ నైపుణ్యం ఉందని కొనియాడారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని లేఖలో వెల్లడించారని గుర్తు చేశారు.
Modi mentions Sircilla weaver in Mann Ki Baat : జీ-20 సమావేశ లోగోను చేనేతతో హరిప్రసాద్ అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన పంపిన లేఖలో జీ-20 సమావేశం భారత్ ఆతిథ్యం ఇవ్వడం అద్భుతమని ప్రస్తావించినట్లు ప్రధాని వెల్లడించారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేత కళకు హరిప్రసాద్ కొత్త సొబగులు అద్దారని ప్రశంసించారు. తనకు పంపిన లేఖలో హరిప్రసాద్.. చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు తెలిపారు. ఆ సూచనలు పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.
"జీ-20 కూటమికి నేతృత్వం.. భారత్‌కు దక్కిన గౌరవం. జీ-20 కూటమిలో భారత్ పాత్ర ఎంతో కీలకం కానుంది. జీ-20 దేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో చర్చిస్తాం. అంతరిక్ష ప్రయోగాల్లో మరిన్ని విజయాలు సాధిస్తున్నాం. ఇటీవల డ్రోన్ల ద్వారా యాపిల్స్ సరఫరా చేయడం చూస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్‌లోని కినోర్‌లో డ్రోన్ల ద్వారా యాపిల్స్ సరఫరా చేస్తున్నారు. యువత.. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారు. ఇండియన్ మ్యూజిక్ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరు వచ్చింది. భారతీయ సంగీత పరికరాలు అనేక దేశాల్లో విక్రయిస్తున్నారు." అని మోదీ ప్రసంగించారు.
ఇవీ చదవండి :