మానవాళికి సవాల్ విసురుతున్న వాటిలో ప్లాస్టిక్ భూతం ఒకటి. పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను వాడేందుకే గతంలో కేంద్రం అనుమతించేది. ఈ ఏడాది జూన్ నుంచి దాన్ని 75 మైక్రాన్లుగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో.. గుంటూరు నగరపాలక సంస్థ ప్లాస్టిక్‌ను సంపూర్ణంగా నిషేధించాలని నిర్ణయించింది. తొలుత అక్టోబర్ 1 నుంచే ప్లాస్టిక్ కవర్ల వినియోగం నిలుపుదలకు నిర్ణయించినా.. వ్యాపార వర్గాల కోరిక మేరకు నవంబర్ 9 వరకు సమయమిచ్చారు.
ప్లాస్టిక్ కవర్లు వినియోగించకుండా చూసేలా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశారు. వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేలా కార్యాచరణ రూపొందించారు. ఎవరైనా ప్లాస్టిక్ సంచులు అమ్మినా, వినియోగించినా.. జరిమానాలు విధించనున్నారు. ప్లాస్టిక్ నిషేధం నిర్ణయంతో పండ్లు, పూలు, కూరగాయల విక్రయాల దుకాణాల వద్ద అధికారులు ఇక మీద విస్తృతంగా తనిఖీలు చేయనున్నారు.
ఇదీ చదవండి: గాయపడిన విద్యార్థులను నేడు పరామర్శించనున్న నారాలోకేశ్