ETV Bharat / state

చేసేందుకు సాయం.. అడ్డు కానే కాదు వైకల్యం

గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తగా పని చేస్తున్న సక్రీబాయి.. విధినిర్వహణలో శారీరక సమస్యను లెక్క చేయకుండా ముందుకు వెళ్తూ.. స్ఫూర్తిని పంచుతోంది. ఆమె సేవలకు కేంద్రం కూడా సలాం కొట్టింది.

author img

By

Published : Apr 23, 2020, 12:41 PM IST

physically handicapped person distributes goods in guntur ds
సాయం చేసేందుకు వైకల్యం అడ్డుకాదు!

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మన్నేపల్లి తండ గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త సక్రీబాయి.. దివ్యాంగురాలు. ఆమె తన శారీరక కష్టాన్ని అధిగమిస్తూ.. విధులను సమర్థంగా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతోంది. మరో ఆయాతో కలిసి 74 మంది చిన్నారులు 19 మంది గర్భిణులకు 3 చక్రాల సైకిల్​పై తానే స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేసింది. ఆమె అంకితభావాన్ని గుర్తించిన కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతిక శుక్ల.. అభినందించారు. సక్రీబాయికి ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించారు.

ఇదీ చూడండి:

సేవే లక్ష్యం... దివ్యాంగుడి దాతృత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.