గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సస్పెన్షన్కు గురయ్యాడు. గుంటూరులో జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడిపై గ్రామస్థులు పిర్యాదు చేశారు. పాఠశాల ఆవరణలో వ్యక్తిగత పనులు చేయిస్తున్నారని, విద్యార్థులతో సిగరెట్లు తెప్పిస్తున్నారని అతనిపై అభియోగాలు ఉన్నాయి. స్వీపర్, మధ్యాహ్న భోజన పథకం నిర్వహకులను దుర్భాషలాడుతున్నాడని ఫిర్యాదు చేశారు. విచారించిన జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని... అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి... ''223 జీవో రద్దు చేయండి.. పదోన్నతులివ్వండి''