ETV Bharat / state

Viral Video: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం..పోలీసుల ఎంట్రీతో... - నరసరావుపేట వార్తలు

అధిక వడ్డీల బాధలు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన పోలీసులు.. బాధితుడిని అదుపులోకి తీసుకుని.. కౌన్సిలింగ్ ఇచ్చారు.

SUICIDE SELFIE
SUICIDE SELFIE
author img

By

Published : Sep 12, 2021, 8:34 PM IST

అధిక వడ్డీలతో ఒక వ్యక్తి తనను మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడని..వాటికి తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నరసరావుపేట క్రిస్టియన్ పాలెంకు చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమంలో వీడియో పోస్ట్ చేశాడు. తన కుటుంబానికి పోలీసులే న్యాయం చేయాలని అందులో కోరాడు. వైరల్ అయివ వీడియోను గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.

Viral Video: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యాయత్నం..పోలీసుల ఎంట్రీతో...

గుంటూరు జిల్లా క్రిస్టియన్ పాలెంకు చెందిన జంగాల నెహేమియా అనే వ్యక్తి అప్పు ఇచ్చి వారానికి 10 రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నాడని ఆ వీడియోలో జంగాల జాన్ వెస్లీ అనే వ్యక్తి తెలిపాడు. అంత మెుత్తంలో డబ్బు చెల్లించడం తనవల్ల కావడం లేదని వాపోయాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని.. జంగాల నెహేమియా నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని పోలీసులకు విన్నవించాడు.

వెస్లీ వీడియోను స్టేటస్​లో పెట్టుకుంటే గుర్తుతెలియని వ్యక్తులు దానిని సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారని నరసరావుపేట రెండో పట్టణ సీఐ వెంకట్రావు తెలిపారు. అయితే వెస్లీకి అప్పు ఇచ్చింది తన సొంత తమ్ముడేనని గుర్తించామన్నారు. వీరిద్దరి మధ్య ఆటో విషయంలో అప్పు ఏర్పడిందన్నారు. ఈ వ్యవహారంలో తమ్ముడు నెహేమియా డబ్బు కోసం.. అన్న వెస్లీని ఇబ్బందులకు గురిచేయడంతో మానసికంగా కుంగిపోయాడని తెలిపారు. ఈ విషయమై వెస్లీ, అతని తమ్ముడు నేహిమియాను స్టేషనుకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బు వారి తండ్రి ఇచ్చేలా ఒప్పందమైందని వెల్లడించాకరు. చిన్న చిన్న విషయాలపై సామాజి కమాధ్యమాలలో పోస్టులు పెట్టొద్దని ఏమైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని సీఐ వెంకట్రావు సూచించారు.

ఇదీ చదవండి:

COUNSELING: 'సత్ప్రవర్తనతో మెలగండి.. రౌడీషీటు తొలగిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.