గుంటూరు జిల్లా కోటప్పకొండలో విద్యుత్ ప్రభపై పని చేస్తుండగా జమ్మలమడక ప్రవీణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు చిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామానికి చెందినవాడు. నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెంలో ప్రతి ఏటా క్రమం తప్పకుండా విద్యుత్ ప్రవాహం కట్టి కోటప్పకొండకు తరలిస్తారు. ఈసారి ప్రభ మొదలైనప్పటి నుంచి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. గురువారం అర్ధరాత్రి కమ్మవారిపాలెం- కట్టుబడివారి పాలెం మధ్య ప్రమాదవశాత్తు ప్రభ పడిపోయింది. పట్టు వదలని గ్రామస్థులు కష్టపడి తిరిగి దానిని కోటప్పకొండకు చేర్చారు. అయితే ప్రభ ఏర్పాటు చేసే క్రమంలో పైకి ఎక్కిన యువకుడు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. వరుస ఘటనలతో ఆందోళన చెందిన అమీన్ సాహెబ్ పాలెం గ్రామస్థులు ఈ సంవత్సరం ప్రభ నిర్వహణను ముగించేసి గ్రామానికి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి: