గుంటూరు సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్ వార్డులో చేరిన ఓ వృద్ధుడు మృతిచెందాడు. నగరానికి చెందిన 64 ఏళ్ల వృద్ధుడు... కరోనా వ్యాపించిందనే అనుమానంతో సోమవారం ఆసుపత్రిలో చేరాడు. అతను గత 15 ఏళ్లుగా టీబీ వ్యాధితో బాధపడుతుండగా... ఐదేళ్ల నుంచి మందులు వాడుతున్నట్లు మృతుని బంధువులు తెలిపారు. కరోనా ఓపికి వచ్చిన అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. నమూనాలు సేకరించి పరీక్షల కోసం విజయవాడకు పంపారు. ఆ రిపోర్ట్స్ రావాల్సి ఉండగా... వచ్చిన తర్వాత కరోనాతో మృతి చెందాడా..? లేక శ్వాసకోశ వ్యాధితో మృతి చెందాడా..? అన్న విషయంపై స్పష్టత వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బాబులాల్ చెప్పారు.
ఇదీచదవండి