క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకొని పురుగుమందు తాగి మృతి చెందిన ఊర సురేష్ అంతక్రియలు గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్లలో జరిగాయి. మరో మిత్రునితో కలిసి అతడు ఐపీఎల్ బెట్టింగ్‌కు బానిస కాగా.. దాదాపు లక్ష రూపాయల వరకు ఇరువురూ అప్పుల పాలయ్యారు. డబ్బుల కోసం బెట్టింగ్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక.. సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాధితులను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సురేష్ మరణించాడు.
పేరేచర్లలోని బేడ బుడగ జంగాల కాలనీలో చిలక జోస్యం చెబుతూ సురేష్ జీవిస్తుండేవాడు. ఏడాది క్రితం రాణి అనే మహిళతో వివాహం అయింది. ఊహించని ఈ ఘటనతో.. అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అరెస్ట్