ETV Bharat / state

అపహరణకు గురైన చిన్నారి గుర్తింపు.. పరారీలో నిందితుడు - child missing case latest news update

భిక్షాటన చేస్తున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి ఆపహరించిన ఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. అయితే పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

missing-child-find-out
అపహరణకు గురైన చిన్నారి
author img

By

Published : Sep 23, 2020, 2:53 PM IST

అపహరణకు గురైన చిన్నారి

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో అపహరణకు గురైన చిన్నారిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. భిక్షాటన చేస్తూ పేరేచర్ల రైల్వే వంతెన కింద చిన్నారి కుటుంబం జీవనం సాగిస్తోంది. రోజూలానే జంక్షన్ వద్ద భిక్షాటనకు వెళ్లిన చిన్నారి.. రాత్రైన తిరిగి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు చుట్టు పక్క ప్రాంతాల్లో వెతికారు. అయినప్పటికీ పాప ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పేరేచర్ల జంక్షన్​లోని సీసీ ఫుటేజ్​ను పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి పాపను అపహరించాడు. కాగా చిన్నారి రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. బాలిక భయపడుతూ.. ఇబ్బంది పడటం గుర్తించిన పోలీసులు.. పాపపై నిందితుడు అఘాయిత్యం ఏమైనా చేశాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చూడండి...

చిత్తూరు జిల్లాలో.. తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.