ETV Bharat / state

Poisonous fevers in Guntur due to Bad Drainage system గుంటూరులో విజృంభిస్తున్న విష జ్వరాలు.. డ్రైనేజి నిర్వాహణ లేమితోనే వ్యాధులంటున్న బాధితులు - విష జ్వరాలు

Poisonous fevers in Guntur due to Bad Drainage system పారిశుధ్య లోపం కారణంగా గుంటూరు నగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గడచిన రెండు వారాల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరగడంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఏఎన్ఏంలు, ఆశ వర్కర్లు ప్రభావిత ప్రాంతాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు.

people_suffering_from_outbreak_of_toxic_fever_in_guntur

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 24, 2023, 10:37 AM IST

Updated : Sep 24, 2023, 3:18 PM IST

Poisonous fevers in Guntur due to Bad Drainage system పారిశుధ్య లోపం కారణంగా గుంటూరు నగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. శివారు కాలనీల చిన్నారులు, పెద్దలు, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులతో అవస్థలు పడుతున్నారు. నగరంలో ఎక్కడికక్కడ రహదారులపై మురుగు నీరు నిలబడిపోవడంతో దోమల తీవ్రత పెరిగి టైఫాయిడ్, మలేరియా, డెంగీ లాంటి వైరల్ జ్వరాలు నగర వాసుల్ని భయపెడుతున్నాయి. గడచిన రెండు వారాల్లో జ్వర పీడితుల సంఖ్య గణనీయంగా పెరగడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది.

Lack of sanitation in Guntur : గుంటూరు నగర వాసులకు జ్వరాల భయం పట్టుకుంది. కొన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యం (Sanitation Situation in Guntur) పడకేయడంతో టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ జ్వరాల సోకే ప్రమాదముందని బాధితులు బెంబెలెత్తి పోతున్నారు. జ్వరాలు వచ్చిన వారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లితే ఎలాంటి వైద్యం చేస్తారో అనే సందేహంతో ఎక్కువ మంది ప్రైవేట్‌ ఆసుపత్రులకు వెళ్తుతున్నారు.

People suffering from fever: జ్వరాలతో వణుకుతున్న చింతపల్లి.. అల్లాడిపోతున్న చిన్నారులు

దీంతో అధికార లెక్కల్లో మాత్రం వైరల్ తదితర జ్వరాలు సంఖ్య తక్కువగా నమోదవుతున్నా, వాస్తవంగా జ్వర పీడితుల సంఖ్య ఎక్కువగానే ఉంది. శివారు, దిగువ మధ్య తరగతి వాసులుండే కాలనీల్లో అధికంగా టైఫాయిడ్ కేసులు (Typhoid Cases Due to Poor Sanitation) నమోదవుతున్నాయి. ఇక వైరల్‌ ఫీవర్ల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతీ ఇంట్లో ఒక్కో కేసు నమోదు అవుతోంది.

Sanitation Situation in Guntur : వైరల్ జ్వరాలకు కారణమయ్యే దోమలు వృద్ధి చెందడానికి పరిసరాల అపరిశుభ్రమే కారణమని తెలిసినా, అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టడం లేదు. శివారు కాలనీల్లో అయితే పారిశుధ్యం పూర్తిగా లోపించింది. ప్రగతి నగర్ లాంటి కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడం, పారిశుధ్యం పై పాలకులు, అధికారులు శీతకన్ను వేయడంతో ఇళ్ల మధ్య మురుగునీరు నిలిచిపోతుంది. ఏడాది పొడవునా మురుగు నిల్వ అలాగే ఉండడంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.చిన్న పిల్లలు వైరల్, టైఫాయిడ్, డెంగీ జ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Booming poisonous fevers : విజృంభిస్తున్న విష జ్వరాలు

పారిశుధ్యం లోపంతో పాటు వాతావరణంలోని మార్పులు కూడా ఈ విష జ్వరాలకు కారణమని వైద్యులు అంటున్నారు. పట్టణ ప్రాథమిక వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో రోగుల తాకిడి పెరిగింది. గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేట, మల్లిఖార్జునపేట, మాంచెస్టర్‌రోడ్‌ యూపీహెచ్‌సీల్లో జ్వర బాధితులు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి జ్వరాల కేసులు పెరిగాయి. చిన్నపిల్లలు మొదలుకుని పెద్దల వరకు పలు రకాల జ్వరాలతో ఆస్పత్రుల బాట పడుతున్నారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఏఎన్ఏంలు, ఆశా వర్కర్లు ప్రభావిత ప్రాంతాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. టైఫాయిడ్, మలేరియా, డెంగీ లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తున్నారు.

పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో మురుగు నీరు నిల్వ ఉండటం వల్ల టైఫాయిడ్, మలేరియా, డెంగీ లాంటి విష జ్వరాలు వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లే జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయన్నారు. తాగే నీరు, తీసుకునే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

కలవర పెడుతున్న జ్వరాలు.. ఆందోళన వద్దంటున్న వైద్యాధికారులు

People Suffering from Outbreak of Toxic Fever in Guntur: పారిశుధ్య లోపంతో గుంటూరులో విష జ్వరాల విజృంభన.. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన కరవు

Last Updated : Sep 24, 2023, 3:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.