కరోనా వ్యాప్తి నివారణకు గుంటూరు జిల్లాలో అధికార యంత్రాంగం లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నారు. ప్రధాన రహదారులతో పాటు ఫ్లైఓవర్పైకి వాహనాలు అనుమతించడం లేదు. ప్రధానంగా గుంటూరు కంకర బ్రిడ్జిపైకి వాహనాలను నిలిపివేయటంతో అటుగా వెళ్లే వాహనదారులు ప్రాణాలును సైతం లెక్కచేయకుండా అనుమతి లేని.. మూసి ఉన్న రైల్వే ట్రాక్లను దాటుతున్నారు. గుంటూరు రెవెన్యూ భవన్ బ్రాడిపేట 14వ అడ్డురోడ్డును కలుపుతూ ఈ రైల్వే ట్రాక్ ఉంది. త్వరగా గమ్య స్థానానికి వెళ్లేందుకు ప్రజలు ఈ దారిలో వెళ్తున్నారు.
ఇదీ చూడండి..