ఆ ఊరిలో ఎటు చూసినా ముచ్చటగొలిపే మయూరాలు.. అందంగా తిరుగుతూ సందడి చేస్తుంటాయి. వలస వచ్చిన ఆ జీవులు వారిలో మమేకమైపోయాయి. సాధారణంగా మనుషులను చూసి అదిరిపడి అడవిలోకి పారిపోయే నెమళ్లు ఆ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. కృష్ణా జిల్లా నందిగామ మండలంలోని అనాసాగరంలో ఈ అపురూప దృశ్యాలు కనిపించాయి.
కొద్ది రోజుల క్రితం కొన్ని నెమళ్లు ఆ ప్రాంతానికి వలస వచ్చాయి. నాటి నుంచి అవి అక్కడి ఊరి ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాయి. గ్రామస్థులు కూడా వాటికి తగిన ఆహారాన్ని అంది ఏంతో జాగ్రత్తగా చూసుకుంటున్నారు. నందిగామ మండలానికి చెందిన రాఘవాపురం, పల్లగిరికట్టు ప్రాంతాల్లోని పొలాల్లో వీటి సంచారం ఉండేదని.. బహుశా ఇవి అక్కడ నుంచే వచ్చి ఉండవచ్చునని అనాసాగరం ప్రజలు భావిస్తున్నారు. వీటి రక్షణకు అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ.. Vishaka steel plant: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం