ETV Bharat / state

వారాహి రంగు వివాదం.. నిబంధనలన్నీ ఒక్క నా కోసమేనా: పవన్​

author img

By

Published : Dec 9, 2022, 10:54 AM IST

Updated : Dec 9, 2022, 7:09 PM IST

PAWAN COUNTER TO YCP LEADER PERNI NANI : వారాహి వాహనానికి నిషేధిత రంగులు వేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్​ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా వైసీపీ నేతలకు స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చారు. నిబంధనలన్నీ ఒక్క పవన్​కల్యాణ్​ కోసమేనా అని ప్రశ్నించారు.

PAWAN varahi
పవన్​ వారాహి

PAWAN KALYAN COUNTER TO PERNI NANI : జనసేన ఎన్నికల ప్రచార వాహనమైన వారాహి రంగులపై వైసీపీ నేతల చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​ స్పందించారు. కనీసం ముదురు ఆకుపచ్చ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటూ ట్వీట్ చేశారు. వారాహి రంగుతో ఆలీవ్ గ్రీన్‌కలర్‌లో ఉన్న మిగతా వాహనాలను ట్విటర్​లో పోస్ట్​ చేశారు. నిబంధనలు ఒక్క పవన్‌కల్యాణ్ కోసమేనా అని ప్రశ్నించారు. అసూయతో వైసీపీ ఎముకలు రోజురోజుకూ కుళ్లిపోతున్నాయని మండిపడ్డారు.

ముందు తన సినిమాలను అడ్డుకున్నారన్న పవన్‌.. ఆపై విశాఖ వెళ్తే హోటల్ గది నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారన్నారు. విశాఖ నగరం నుంచి బలవంతంగా పంపించేశారన్నారు. మంగళగిరిలో కారులో వెళ్తుంటే అడ్డుకున్నారన్నారని.. ఇప్పటం గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నా ఆపేశారంటూ ఆక్షేపించారు. ఇప్పుడు వాహనం రంగుపైనా వివాదం చేస్తున్నారన్న పవన్‌.. ఇకపై శ్వాస తీసుకోవడం కూడా ఆపేయమంటారా? అని ప్రశ్నించారు.

  • 1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..

    — Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

YCP, Which green variant is ok for you??from this picture? pic.twitter.com/cCH11XFHHY

— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022 ">

MANOHAR ON PERNI NANI COMMNENTS : జనసేనాని ప్రచార రథం వారాహి పై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తిప్పికొట్టారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి చీవాట్లు తిన్న నాయకులా తమకు నీతులు చెప్పేది అని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 9, 2022, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.