ETV Bharat / state

ప్రజా గొంతుక వినిపించేవారిపై వేధింపులు: పవన్ కల్యాణ్​ - Pawan Kalyan is angry with Jagan

Pawan Kalyan Comments: ఉత్తరాంధ్ర విధ్వంసానికి వైకాపా వ్యూహం పన్నిందని.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. చట్టాల్ని అపహాస్యం చేసే ఉగ్రవాదులే రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ పర్యటనలో విధ్వంసం సృష్టిస్తారని ముందే తెలుసని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్‌... అయినా తెగింపుతోనే వెళ్లానని స్పష్టం చేశారు.

Pawan Kalyan Speech
పవన్ కళ్యాణ్
author img

By

Published : Oct 30, 2022, 10:48 PM IST

Updated : Oct 31, 2022, 7:04 AM IST

పవన్ కళ్యాణ్

Janasena leader Pawan Kalyan: ఆదివారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్నపవన్‌కల్యాణ్‌... వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వ్యవస్థలను నాశనం చేసే పాలకులకు పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే, ఇంట్లో మహిళల్ని రేప్‌ చేసి చంపేస్తామంటున్న వారికి పాలకులు గులాం అవుతుంటే .. చెప్పు చూపించక ఏం చేయాలని.. పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. సామాన్యుడి గుండె ఎంత మండిపోతుందో ఆలోచించాలన్నారు. మీరు ఏ భాషలో మాట్లాడితే అదే భాషలో సమాధానం చెప్పామంటూ వైకాపా నేతలనుద్దేశించి పవన్‌ వ్యాఖ్యానించారు. 2024లో కచ్చితంగా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్‌ రద్దు చేసే బాధ్యత తీసుకుంటామని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామన్నారు.

విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో విధ్వంసం చేయాలని వైకాపా చూస్తోందన్న పవన్‌... అందులో భాగంగానే ఈ నెల 15న జనసేనపై ఆంక్షలు.. విమానాశ్రయంలో ప్రభుత్వ ప్రాయోజిత గలాటా.. జనవాణి జరగనీయకుండా కేసులు పెట్టడం జరిగాయన్నారు. నేరమయ రాజకీయాలు చేసే నేతలకు ఐపీఎస్‌ అధికారులు సెల్యూట్‌ చేయడం మన రాష్ట్రంలోనే ఉందని విమర్శించారు. తన విశాఖ పర్యటనలో ప్రభుత్వం చేయబోయే విధ్వంసంపై.. అయిదు రోజుల ముందే కొందరు సన్నిహితులు, శ్రేయోభిలాషుల ద్వారా సమాచారం అందిందని పవన్‌ చెప్పారు. వాటికి భయపడి ఇంట్లో ఉంటే ఎలా అని తెగించి విశాఖలో అడుగుపెట్టామన్నారు.

న్యాయపరమైన అంశాలపై జనసేన శ్రేణులు చైతన్యం కావాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచిన పార్టీని మనం నిత్యం వణికిస్తున్నామంటే అది ప్రజాస్వామ్యం గొప్పదనమేనన్నారు. స్థానికంగా ఉండే ప్రతి సమస్యపైనా పోరాడాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, నేర రాజకీయాల నుంచి రాష్ట్రాన్ని విముక్తం చేసేలా పనిచేద్దామని... జనసైనికుల్లో ఉత్సాహం నింపారు.

జనవాణిలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన పవన్‌ కల్యాణ్‌పై దాడి చేయాలని.. అలజడి సృష్టించాలని ప్రభుత్వమే కుట్ర పన్నిందని ఆ పార్టీ పీఎసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ర్యాలీకి ముందు రోజు రాత్రి విశాఖలో ఒక ముఖ్య వ్యక్తి ఇంట్లో ఇందుకు వ్యూహరచన జరిగిందని తెలిపారు ‘జనసేనానిపై దాడికి కుట్ర’ పేరుతో వీడియో ప్రదర్శించారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లి, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నుంచి వైకాపా నాయకులు ఆదివారం జనసేనలో చేరారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 31, 2022, 7:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.