Pawan Kalyan Comments: అమరావతి రాజధానిగా గతంలో ఒప్పుకున్న వైకాపా.. ఇప్పుడు మాట తప్పి.. రైతులను ఇబ్బందికి గురి చేయడం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలో పార్టీ లీగల్ సెల్ సమావేశంలో మాట్లాడిన పవన్‌కల్యాణ్.. చట్టసభల సాక్షిగా ప్రమాణాలు చేసి.. మాట తప్పితే ఇక వారికి విలువ ఏం ఉంటుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా 45-67 స్థానాలకే పరిమితమవుతోందని తనకు సర్వేలు అందాయన్నారు. పార్టీ బలోపేతం కోసం ముందుగా అక్టోబర్‌లో తలపెట్టిన యాత్రను వాయిదా వేయనున్నట్లు పవన్‌కల్యాణ్ తెలిపారు. ఈలోగా జనసేన-జనవాణి, కౌలురైతుల భరోసా యాత్ర పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు.
2014లో నేను గుడ్డిగా తెదేపాకు మద్దతు ఇవ్వలేదన్నారు. జనసేన పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలుంటే ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లమని అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకంలో జగన్‌కు శ్రద్ధ లేదా అని ప్రశ్నించారు. భవన కార్మికుల సంక్షేమ నిధులు 450 కోట్లు, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నిధులు 400 కోట్లు రూపాయలు దారి మళ్లించారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఎక్కువగా ఉందని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న పోస్టులు పెట్టినా కేసులు, వేధింపులకు గురి చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిదానికీ ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందని.. అలాగే మనిషికీ, అధికారానికీ ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుందని గ్రహించాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: