ETV Bharat / state

Pawan Kalyan In Delhi: దిల్లీకి చేరిన పవన్​ కల్యాణ్​.. పొత్తులపై ఏమన్నారంటే..! - NDA Meeting 2023

NDA Meeting In Delhi: ఎన్డీఏ కూటమి నిర్వహిస్తున్న భేటీలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ దిల్లీ చేరుకున్నారు. ఈ భేటి కోసం బీజేపీ అగ్రనేతల నుంచి ఆహ్వానం అందగా ఆయన దిల్లీకి వెళ్లారు. రేపటి సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 17, 2023, 10:37 PM IST

Pawan Reached To Delhi For NDA Meeting: మంగళవారం దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. దీంతో పవన్​కల్యాణ్​ దిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనే అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు పవన్​ కల్యాణ్​ తెలిపారు. బీజేపీ సినీయర్​ నేతలు తనను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మార్గాలపై భేటీలో చర్చించనున్నట్లు వివరించారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తామని ఆయన వివరించారు.

  • ఢిల్లీ చేరుకున్న జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. pic.twitter.com/wIJgBGeiWC

    — JanaSena Party (@JanaSenaParty) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీలో ఎన్డీఏ భేటీ.. భారతీయ పార్టీ ఆధ్వర్యంలో జులై 18వ తేదీన దేశ రాజధాని దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంపై ఏదైనా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.

NDA Meeting 2023 : ఐక్యత పేరుతో ప్రతిపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్న వేళ దిల్లీ వేదికగా తమ బలాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ) సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఎన్​డీఏ సమావేశంలో ప్రస్తుతం కూటమిలో ఉన్న పార్టీలతో పాటు కొత్త భాగస్వామ్యులు కూడా హాజరుకానున్నారు. ఈ మేరకు గతంలో ఎన్​డీఏ నుంచి వైదొలిగిన వారిని సైతం తిరిగి కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఇటీవల బీజేపీ అనేక ప్రయత్నాలు చేసింది. దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ సమావేశం ద్వారా 2024 ఎన్నికల ప్రచారాన్ని కమలదళం ప్రారంభించనుందని సమాచారం. తనతో పాటు భాగస్వామ్య పార్టీలను తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోందని విమర్శలు వినిపిస్తున్న వేళ దిల్లీలో జరగనున్న ఎన్​డీఏ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి 38 పార్టీల నేతలు హాజరుకానున్నారని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

Amanchi Swamulu to Janasena: 'జనం బాగుండాలంటే.. జగన్‌ పాలన పోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.