PAWAN జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థలను బలోపేతం చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉంటే వ్యవస్థలు మారవని తేల్చిచెప్పారు. రాజకీయాలలో మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని.. జనసేన ఆవిర్భవించింది భావితరాల కోసమేనని స్పష్టం చేశారు. కేసులకు భయపడే వ్యక్తిని కాదని.. జనసేన అధికారంలోకి రాగానే అందరి లెక్కలూ తేలుస్తానని స్పష్టం అన్నారు.
వైకాపా నాయకులు దిల్లీ వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసని.. వైకాపా ఎంపీలు ప్రధాని ముందు నోరు మెదపరని అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం అప్పులు చేసి అభివృద్ధి అంటోందని.. ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ సూచించారు.
ప్రజలు ఉపాధి లేక అల్లాడిపోతున్నారని.. గుడివాడలో ఇసుక దందా నడుస్తోందని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో జనసేన నాయకులపై కేసులు అన్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా యాప్‌తో ఒరిగిందేమీ లేదని.. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న ప్రభుత్వమిదని దుయ్యబట్టారు. పదవి కోరుకుంటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినని స్పష్టం చేశారు. పార్టీ నడపటానికి అర్హత మీకే ఉందా? మాకు లేదా? అని ప్రశ్నించారు. ఒక్కసారి జనసేన వైపు చూడాలని ప్రజల్ని కోరారు.
ఇవీ చదవండి: