ఇదీ చదవండి:
'అమరావతిపై కేంద్రం స్పందించే వరకూ పోరాటం చేస్తాం' - ap capital issue
రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకూ జనసేన పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాజధాని రైతులకు పవన్ సంఘీభావం తెలిపారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల దమనకాండను ఆయన ఖండించారు.
రాజధాని రైతులతో పవన్
రాజధాని ప్రాంత రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ప్రభుత్వ అడుగులన్నీ మూడు రాజధానుల వైపు పడుతున్నా... ఎక్కడా ఒక్క కచ్చితమైన విషయాన్ని చెప్పడం లేదన్నారు. రాజధాని కోసం ఇన్ని వేల ఎకరాలు తీసుకున్నప్పుడే... ప్రభుత్వాన్ని హెచ్చరించానని పవన్ అన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కేంద్రం కూడా అమరావతి సమస్య పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం స్పందించే తీరును బట్టి జనసేన పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి భూమి ఇస్తే.. ఇంత మోసం జరుగుతుందని రైతులు అనుకోలేదన్నారు. మహిళలు, రైతులపై పోలీసుల దమనకాండను పవన్ ఖండించారు. అన్యాయం జరిగిందని గళం విప్పితే... పోలీసులతో బలవంతంగా అణచివేయాలనుకోవడం సరికాదని హితవు పలికారు. రాజధాని రైతులకు అండగా ఉంటానని జనసేనాని మరోసారి ఉద్ఘాటించారు.
ఇదీ చదవండి: