Pawan Kalyan Meeting With Youth: యువ సమూహం తన వెంట ఉంది కాబట్టే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోరాడుతున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నివాళులు అర్పించారు. విభిన్న రంగాలు, ప్రాంతాల నుంచి వచ్చిన యువతతో పవన్ సమావేశమయ్యారు. దశాబ్దంగా తనతో నడుస్తున్న యువతకు కచ్చితంగా అండగా నిలుస్తానని పవన్ హామీ ఇచ్చారు.
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 'గ్లాసు టీ' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వివేకానందుని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం యువతతో జనసేనాని ప్రత్యేకంగా మాట్లాడారు. వారితో కలిసి టీ తాగుతూ వారి ఆలోచనలు తెలుసుకున్నారు. తనను అన్ని విధాలా నమ్మి, లక్ష్య సాధనలో నిలబడింది యువత మాత్రమేనని అన్నారు.
పవన్ కళ్యాణ్‌ను కలిసిన పలువురు నేతలు- తాజా రాజకీయాలపై చర్చ
ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగిన యువ సమూహమే జనసేన వెంట ఉందని, వారి అండతోనే వైసీపీ వంటి నేరపూరిత ఆలోచనలు ఉన్న పార్టీతో పోరాడుతున్నానని పవన్ వివరించారు. నవతరం ఆలోచనలు విభిన్నంగా ఉంటాయని, సమాజంలో జరిగే అన్ని విషయాల మీద యువతకు ఉన్న ఆలోచనే తనకు స్పష్టం చేశారు. సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తానని వివరించారు.
వైఎస్సార్సీపీతో వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించలేను: అంబటి రాయుడు
రాజధానితోపాటు అన్ని జిల్లాల్లోనూ ఆర్థిక అభివృద్ధి జరగాలని పవన్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే దిశగా ఆలోచిస్తానని, ఐటీ రంగంతో పాటు వ్యవసాయం, వ్యాపారం ఇతర రంగాల్లోనూ అవకాశాలు కల్పించే విధంగా చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు లేక యువత వలస వెళ్లి సాధారణ జీతాలకు పని చేసే పద్ధతి మారాలన్నారు. అధికారం లేకపోయినా యువతరంతో మాట్లాడుతున్నానని, అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా యువత గొంతుకనువుతానని భరోసా ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోందని, అనేక నేరాలకు ఇదే మూలమన్నారు. రాష్ట్రంలో నేరాలను అరికట్టాలంటే ముందుగా గంజాయి ముఠాలను కట్టడి చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం సమస్యను తన దృష్టికి తెచ్చింది ఇద్దరు యువకులని, దానిపై పోరాటం చేశామని గుర్తు చేశారు. యువత చెప్పే ప్రతి ఆలోచనలను జాగ్రత్తగా విని, వాటిని ప్రజా పాలసీగా తీసుకొస్తానని పవన్ వివరించారు. రానున్న రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వంలో జవాబుదారీతనం ఉంటుందన్నారు.
సమగ్ర భూరక్ష చట్టం హక్కుల ఉల్లంఘనే - అమలుకాకుండా చూసే బాధ్యత నాది : పవన్