ఒకే చోట నుంచి పాలన- అభివృద్ధి వికేంద్రీకరణే తమ విధానమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిని రాజధానిగా ఇష్టం లేకుంటే....రాయలసీమలో గానీ, విశాఖలో గానీ ఏర్పాటు చేయాలి కానీ 3 ప్రాంతాల్లో పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి సంతృప్తి లేకుండా ఇటో ముక్క, అటో ముక్క ఎందుకన్నారు. కంచె చేను మేసినట్లు..పాలకులే అమరావతి రైతులను మోసం చేస్తే వారు ఎక్కడికి వెళ్తారన్నారు. ప్రజలను అణిచివేయాలని చూస్తే ఉద్యమాలు వస్తాయన్న పవన్...అవి ఏ స్థాయికైనా దారితీస్తాయని హెచ్చరించారు. ఏకాభిప్రాయం సాధించి రాజధాని ఎక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.... ప్రజల మధ్య అసమానతలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. పాలకపక్షం రోజుకో ప్రకటనతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
పరిపాలన ఒకచోట నుంచే జరగాలన్న పవన్... శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఒకేచోట ఉండాలన్నారు. అమరావతిలో రైతులు పిల్లలతో సహా రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
నవరత్నాలు అమలు చేయటం సాధ్యం కాక ప్రజల్లో గందరగోళం తెచ్చేందుకే 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని పవన్ ఆరోపించారు.
ఇదీ చదవండి :