భారత అండర్-19 వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సెలెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి సాయం అందించారు.
జనసేన నాయకులు.. గుంటూరులోని రషీద్ నివాసానికి వెళ్లి పవన్ కల్యాణ్ తరఫున చెక్కు ఇచ్చారు. పవన్ తరపున అభినందనలు తెలిపారు. త్వరలో రషీద్‌ను పవన్ కలుస్తారని పార్టీ నేతలు చెప్పారు.
ఇదీ చదవండి : అండర్-19 క్రికెటర్ షేక్ రషీద్‌కు సీఎం అభినందనలు