జనసేనను విలీనం చేయాలంటూ ఓ పార్టీ తనపై ఒత్తిడి చేసిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పోటీ చేసిన శాసనసభ అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పార్టీలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే స్పష్టంగా తనకు తెలియజేయాలన్నారు. అంతేకాని సామాజిక మాధ్యమాలను ఆశ్రయించవద్దని సూచించారు. జనసేన ఒక ఉన్నతమైన భావజాలంతో పెట్టిన పార్టీ అని... పార్టీ పెట్టింది ప్రజలను సమానత్వం కోసమని, ద్వితీయ పౌరులుగా చూడకుండా ఉండేందుకేనని పవన్ తెలిపారు. అంతేకాని కొంతమంది బెదిరిస్తే భయపడిపోయే వాడిని కాదన్నారు. వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఓటమి బాధ ఉన్నా... పార్టీని బలహీనపర్చాలని చూస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నుంచి ప్రభుత్వ పనితీరుపై స్పందిస్తామన్నారు.
ఇదీ చదవండి :