"151 సీట్లు వచ్చాయని పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం" అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒంగోలు పర్యటన ముగించుకొని విజయవాడ వెళ్తున్న పవన్‌కు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ సెంటర్లో కాసేపు అగి కారులోనుంచే అభిమానులనుద్దేశించి మాట్లాడారు. అదృష్టం అందలం ఎక్కిస్తే..బుద్ధి బురదలోకి లాగిందని వైకాపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. వైకాపా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు తమ దౌర్జన్యాలను ఆపాలన్నారు. ఒక్క జనసేన గొంతునొక్కి చంపేస్తే..లక్షల గొంతులు బయట నిలదీస్తాయని హెచ్చరించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనవసర పథకాలు పెట్టి ప్రజలతో ఊడిగం చేసుకునే పద్ధతి జనసేనది కాదన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటమే తమ లక్ష్యమన్నారు.
ఇదీచదవండి