గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడుతున్న తెదేపా నేతలను గృహ నిర్బంధం చేయటాన్ని ఖండిస్తున్నామని ప్రత్తిపాటి అన్నారు. ఉద్యమాన్ని ఎంత అణచివేస్తే అంతగా ఉద్దృతం చేస్తామని హెచ్చరించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులే ప్రభుత్వానికి మరణ శాసనం రాస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఖరి వల్ల మృతి చెందిన ఆరుగురు రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పడు జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేసినా తాము అడ్డుకోలేదని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రజస్వామ్యాన్ని అణచివేయాలని చూడటం తగదని హితువు పలికారు.
ఇదీ చదవండి: ఎంపీ గల్లా జయదేవ్ గృహ నిర్బంధం.. పరిస్ధితి ఉద్రిక్తం