ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి బెయిల్ ఇవ్వొద్దంటూ సీబీఐ ఏకంగా 14 పేజీల అఫిడవిట్ దాఖలు చేసిందంటే.. సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతోందంటూ తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వ్యాఖ్యానించారు. సీబీఐ చెప్పినట్లే.. కేసుల్లో ఉన్నవారిని ప్రభావితం చేస్తారన్న మాటను నిజం చేస్తూ తితిదే బోర్డులో సహచర నిందితులకు పదవులు కల్పించారంటూ మండిపడ్డారు. కోర్టు జడ్జిలు సైతం ఆశ్చర్యపోయేంతలా అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి.. తమపై అవినీతి ముద్రను వేస్తున్నారంటూ ఆగ్రహించారు. ప్రస్తుతం ఆర్ధిక నేరాల్లో జైలు శిక్షలు అనుభవిస్తున్న వారు బెయిల్ తీసుకోవటానికి జగన్ కేసుల్ని ఓ ఉదాహరణగా వాడుకుంటున్నారని... అందుకు చిదంబరం తరఫు లాయరు కోర్టులో చేసిన అప్పీలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. సీబీఐ కేసుల్ని ప్రభావితం చేసేందుకే జగన్ ప్రధానిని కలుస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న ఈ అనుమానాలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: