తెదేపా ప్రభుత్వం హయాంలో తెచ్చిన పరిశ్రమలను తరలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పిన జగన్ ప్రజలకు వెన్ను పోటు పొడిచారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడేపల్లి గంజాయి అడ్డగా మారిందని ఆరోపించారు. సీఎం, డీజీపీ ఉండే ప్రాంతంలో యువత మత్తుకు బానిసలు అవుతుంటే చర్యలు లేకపోవడం శోచనీయమన్నారు. గంజాయిపై ప్రశ్నించిన తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి